నవతెలంగాణ – భువనగిరి
హోలీ పండుగను పురస్కరించుకొని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ పండుగ వసంత రుతువుకు స్వాగతం పలుకుతుందని, స్నేహభావంతో పోలిని జరుపుకోవాలన్నారు.
హోళీ పండుగను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలియజేశారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.
రసాయన రంగులతో కాకుండా సహజ సిద్ధంగా తయారయ్యే రంగులతో హోలీ పండుగను జిల్లా ప్రజలు జరుపుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ విజ్ఞప్తి చేశారు హోలీ పండుగ పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
హోలీ శుభాకాంక్షలు: ఎండి జహంగీర్ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి

జిల్లా ప్రజలకు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎం డి జహంగీర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగను ఆనందోత్సవాలతో వేడుక నిర్వహించుకోవాలన్నారు.