
– పోస్టల్ బ్యాలెట్ లో పోలైన ఓట్లు 78
నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం వ్యాప్తంగా రెండో రోజు కొనసాగిన హోమ్ ఓటింగ్ లో మొత్తం 172 ఓట్లు కు ఆదివారం నాటికి 162 ఓట్లు,మొత్తం 372 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కు గాను 78 ఓట్లు పోల్ అయినట్లు మండల ఎన్నికల అధికారి,తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ తెలిపారు. వయో అధిక,వికలాంగులు ఓటర్లు మొత్తం 172 మందికి గాను శనివారం 108,ఆదివారం 54 ఓట్లు పోల్ అవగా,ఖమ్మం,ఇతర జిల్లాల పోస్టల్ బ్యాలెట్ మొత్తం 372 ఓట్లకు గాను ఇతర జిల్లాల 60 మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు 16,ఖమ్మం జిల్లా మొత్తం పోస్టల్ బ్యాలెట్ ఓటర్లకు గానూ 52 మంది మొత్తం 78 మంది సిబ్బంది తమ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వినియోగించుకున్నారు. ఈ హోమ్ ఓటింగ్ లో నవీన్,సందీప్,లక్ష్మి,హరిత,పద్మావతి,వీరయ్య,శ్రీశైలం,రాము,కిరణ్ కుమార్,రాం సుందర్,గోపాల స్వామి,శ్రీహరి,సంతోష్ రామారావు లు పోలింగ్ సిబ్బంది గా వ్యవహరించారు.