Tuesday, May 19, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర కల్లుగీత కార్మికుల సహకార కార్పొరేషన్ కు సన్మానం

రాష్ట్ర కల్లుగీత కార్మికుల సహకార కార్పొరేషన్ కు సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ : మోపాల్ మండలం బొర్గం(పి)  గ్రామంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలోని శ్రీ లవకుశ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కల్లు గీత కార్మికుల సహకార కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన శేఖర్ గౌడ్ ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనముగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆలయ వ్యవస్థాపకులు ఈగ సంజీవ రెడ్డీ, శేకర్ గౌడ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఈగ సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. సౌమ్యుడు, అందరికి అందుబాటులో వుండే శేఖర్ గౌడ్ కు చైర్మన్ పదవి రావడం అయన కష్ట పలమని అన్నారు.

ముందు మరిన్ని పదవులు ఆశించాలని ఆయన అన్నారు. అలాగే కమిటీ ఆధ్వర్యంలో బోర్గం గ్రామానికి చెందిన అశోక్ కు కార్పొరేషన్ లో కో ఆప్షన్ మెంబర్గా నియామకమైన సందర్భంగా ఆయనను కూడా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీత శేఖర్ గౌడ్ మాట్లాడుతూ ఆలయానికి మరియు గ్రామానికి తన చేతనైన సహాయ సహకారాలు అందిస్తానని దేవాలయ మరియు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. శ్రీ లవకుశ ఆంజనేయ స్వామి ని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.

అలాగే నూతన నూతనంగా ఎన్నుకోబడ్డ కోఆప్షన్ మెంబర్ అశోక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో కృషి చేస్తానని అలాగే దేవాలయ అభివృద్ధి కోసం కూడా పాటుపడతారని ఆయన అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఈగ నర్సారెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయి రెడ్డి, కోశాధికారి అజిత్ రెడ్డి, ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి, అజయ్ రెడ్డి, కృష్ణారెడ్డి, బాల్ రెడ్డి, బోర్గం గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శేఖర్ రెడ్డి,గ్రామ కమిటీ అధ్యక్షులు ఈగ రమేష్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -