Sunday, July 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమీ చదువులు ఎలా సాగుతున్నాయి..?

మీ చదువులు ఎలా సాగుతున్నాయి..?

- Advertisement -


వాహీద్‌నగర్ బాయ్స్ హైస్కూల్‌ను
పరిశీలించిన ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ – మలక్‌పేట్

హైదరాబాద్‌ మలక్‌పేట్ నియోజకవర్గంలోని ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ వాహీద్‌నగర్ బాయ్స్ హైస్కూల్‌లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో శనివారం పాఠశాలను సందర్శించి సమస్యలపై సర్వే నిర్వహించారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో సుమారు 310 మంది విద్యార్థులు చదువుతుండగా, 18 మంది ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. బయాలజీ, సోషల్, తెలుగు వంటి ప్రధాన సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు దెబ్బతింటున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యారంగంలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పారు. పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, బోరు పాడై చాలా కాలమైనా మరమ్మతులు చేపట్టలేదని అన్నారు. సరిపడా మరుగుదొడ్లు లేవన్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు తాగునీరు, మరుగుదొడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి పి. శశికళ, జిల్లా ఉపాధ్యక్షురాలు స్వరూప, జిల్లా ఖజాంచి కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -