నవతెలంగాణ-హైదరాబాద్ : అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్‌లో భాగంగా ఐఫోన్ 14 భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది. ఈ రెండు ఈ-కామర్స్ దిగ్గజాల్లో ప్రస్తుతం నడుస్తున్న సమ్మర్ సేల్‌లో ఎంపిక చేసిన కలర్ వేరియంట్స్‌లో ఐఫోన్ 14 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఒరిజినల్ ప్రైస్ రూ. 79,900 కాగా, రూ. 67,999కే లభిస్తోంది. ఇతర కలర్ వేరియంట్స్ రూ. 69,999కి అందుబాటులో ఉంటాయి. ఇక అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్‌తో పాటు ఈఎంఐ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ నుంచి హాట్ డివైజ్‌ను కొనుగోలు చేసే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లకు అదనంగా పది శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు. అధిక స్టోరేజ్‌తో పాటు, ఎంపిక చేసిన కలర్ ఆప్షన్స్‌ను ఎంచుకున్న వారికి ఐఫోన్ 14 256జీబీ వేరియంట్ ఎంఆర్‌పీ రూ. 89,990 కాగా రూ. 77,999కి అందుబాటులో ఉంది. 512జీబీ స్టోరేజ్ ఆప్షన్ 1,09,900 కాగా, కేవలం రూ. 97,999కే ఆఫర్ చేస్తున్నారు. ఐఫోన్ 14 పలు స్టోరేజ్ ఆఫ్షన్లతో పాటు రెడ్, బ్లాక్, వైట్, యల్లో, బ్లూ, పర్పుల్ కలర్స్‌లో యూజర్లు హాట్ డివైజ్‌ను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది.