ఆఫ్ఘ‌నిస్తాన్‌పై వెస్టిండీస్ భారీ విజయం..

నవతెలంగాణ – సెయింట్ లూసియా: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ గ్రూప్ సీ మ్యాచ్‌లో వెస్టిండీస్ 104 ర‌న్స్ తేడాతో ఆఫ్ఘ‌నిస్తాన్‌పై విజ‌యం సాధించింది. రెండు జ‌ట్లూ ఇప్ప‌టికే సూప‌ర్‌-8 స్టేజ్‌కు వెళ్లినా.. చివ‌రి లీగ్ మ్యాచ్‌లో మాత్రం వెస్టిండీస్ త‌న స‌త్తా చాటింది. ఈ మ్యాచ్‌లో విండీస్ బ్యాట‌ర్లు దుమ్మురేపారు. భారీ షాట్ల‌తో అల‌రించారు. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత‌ ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 218 ర‌న్స్ చేసింది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ త‌న ప‌వ‌ర్ హిట్టింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. 53 బంతుల్లో అత‌ను 98 ర‌న్స్ చేశాడు. పూర‌న్ త‌న ఇన్నింగ్స్‌లో 8 సిక్స‌ర్లు, 6 ఫోర్లు కొట్టాడు. ఇక బ్యాటింగ్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ త‌డ‌బ‌డింది. భారీ స్కోర్‌ను చేధించ‌లేక‌పోయింది. 16.2 ఓవ‌ర్ల‌లో ఆ జ‌ట్టు కేవ‌లం 114 ర‌న్స్‌కే ఆలౌటైంది. ఈ గెలుపుతో గ్రూప్ సీలో విండీస్ టాప్ ప్లేస్‌లో నిలిచింది.

Spread the love