హుస్నాబాద్ సర్వేయర్ ను సస్పెండ్ చేయాలి: రవీందర్ గౌడ్

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ హద్దుల నిర్ణయించడంలో నిర్లక్ష్యం చేస్తున్న హుస్నాబాద్ సర్వయర్ ను సస్పెండ్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్  సోమవారం ఏం అర్ ఓ కు వినతిపత్రం అందజేశారు. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ భూములు  కబ్జాలు జరుగుతున్న రెండు  సంవత్సరాలుగా హద్దులు నిర్ణయించడం లేదన్నారు. సర్వే నంబర్లు  12, 921 కొలచి  భూములపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్షాలు కోరిన సర్వేయర్ పట్టించుకోవడం లేదన్నారు. సర్వే నంబర్ 12 లో కోట్ల  విలువ చేసే ఎకరం భూమి అన్యాక్రాంతం అవుతుందన్నారు. 921 సర్వే నంబర్లు లో ఆరు ఎకరాల నర భూమి ఉంటే 1ఎకరం నర భూమి కబ్జా అయిందన్నారు. గతంలో 627 సర్వేనెంబర్  లో రెండు ఎకరాల భూమి ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎవరు కొనుగోలు జరప వద్దని ఎమ్మార్వో వాణి అట్టి భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారన్నారు. ఆ భూమి కూడా ఈ రోజు కనబడుటలేదన్నారు. ప్రభుత్వ భూములకు కాపలా ఉండవలసిన అధికారులే నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాజకీయ నాయకులు అండతోనే సర్వేయర్ పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో తెలిపారు.
Spread the love