Saturday, May 16, 2026
E-PAPER
Homeసోపతిహైదరాబాద్ కుర్రోడి గ్రో అథ్లెట్ అథ్లెట్

హైదరాబాద్ కుర్రోడి గ్రో అథ్లెట్ అథ్లెట్

- Advertisement -

‘బీటెక్‌ చేసేద్దాం.. కోడింగ్‌లో పట్టు సాధిద్దాం.. మంచి ప్యాకేజీతో కొలువు కొట్టేద్దాం’… ఇదీ చాలామంది కుర్రాళ్ల వరస! ఇంకొందరేమో భిన్నం..’చదివిన చదువు సమాజానికి ఉపయోగ పడాలి, నేర్చుకున్న విజ్ఞానం సరికొత్త ఆవిష్కరణలకు దారి తీయాలి’ అనుకుంటారు. కషి, పట్టుదలతోపాటు సాధించాలనే తపన ఉంటే చిన్న వయసులోనూ ఎన్నో విజయాలు సాధించవచ్చు అని నిరూపించాడు హైదరాబాద్‌ కుర్రాడు ఆండె హేమంత్‌. 18 ఏండ్లకే టీ హబ్‌లో ఇంటర్న్‌గా అవకాశం దక్కించుకున్నాడు. తన టాలెంట్‌తో అంతర్జాతీయ కంపెనీలతో కలిసి 150కిపైగా సర్టిఫికేట్లు సాధించాడు. అంతేకాదు ”గ్రో అథ్లెట్‌” అనే సంస్థను స్థాపించి టీ హబ్‌లో అత్యంత యువ స్టార్టప్‌ ఫౌండర్‌గా గుర్తింపు పొందాడు. ఒక సామాన్య విద్యార్థి అసాధారణమైన పారిశ్రామికవేత్తగా (జుఅ్‌తీవజూతీవఅవబతీ) ఎలా మారవచ్చో చెప్పే స్పూర్తిదాయక కథనం ఇది. చిన్నవయసులోనే అతడికి ఇంటర్న్‌గా ఎలా అవకాశం వచ్చింది? అంతర్జాతీయ కంపెనీల్లో భాగస్వామ్యం ఎలా లభించింది? ఆ విషయాలు ఈ వారం జోష్‌ లో…

హేమంత్‌ చిన్నప్పటి నుండి టెక్నాలజీ మీద మక్కువ పెంచుకున్నాడు. అయితే, చాలామందిలా కేవలం చదువుకే పరిమితం కాలేదు. సమాజంలో ఉన్న ఒక సమస్యను పరిష్కరించాలనుకున్నాడు. అదే ”గ్రో అథ్లెట్‌ (Grow Athlete)’ కు నాంది పలికింది. ప్రస్తుతం అండర్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్‌ అయిన హేమంత్‌… నగరంలోని గోకరాజు రంగరాజు కాలేజీలో చదువుతున్నాడు. 16-17 ఏండ్ల వయసులోనే తన స్టార్టప్‌ ఆలోచనను సిద్ధం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోనిT-Hub(స్టార్టప్‌ ఇంక్యుబేటర్‌) లో ఒక ఇంటర్న్‌గా చేరి, అసలు స్టార్టప్‌ ప్రపంచం ఎలా పనిచేస్తుందో దగ్గరుండి గమనించాడు. ఏఐ టూల్స్‌… చాట్‌ జీపీటీ క్లాసెస్‌ చెప్పాడు హేమంత్‌ కేవలం ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ మాత్రమే కాదు, థియరిటికల్‌ గా కూడా తనని తాను నిరూపించుకున్నాడు. తాను ఫస్ట్‌ ఇయర్‌ లో ఉన్నప్పుడు ఒక ఆర్గనైజేషన్‌ ప్రారంభించాడు. ఇంటర్నేషనల్‌ స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ టూల్స్‌ ఎలా పనిచేస్తాయి, చాట్‌ జీపీటీ ఎలా పనిచేస్తుంది అనేవి నేర్పించాడు. అది దాదాపు 10 వేల మంది విద్యార్థుల వరకు వెళ్లింది. దీంతో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థల నుండి 150కి పైగా సర్టిఫికేషన్లు సాధించి గిన్నిస్‌ రికార్డు దిశగా అడుగులు వేశాడు.

టీ-హబ్‌ లో అవకాశం
ఇవన్నీ చేయడం వల్ల టీహబ్‌లో మేనేజర్‌ ఒకరు తనని చూసి సైన్స్‌ టెక్నాలజీ డిపార్ట్మెంట్‌ లో అవకాశం ఇచ్చారు. వాస్తవానికి టీ-హబ్‌ లో బాగా చదువుకున్నవాళ్లను, కార్పొరేట్స్‌నే తీసుకుంటారు. కానీ, అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడిదాకా వచ్చాడు హేమంత్‌. సీబీఎస్‌ఈ స్కూల్‌ లో చదువుతున్నప్పుడే స్పోర్ట్స్‌ ఆడేవాడు. కానీ ‘నేను ఏం సాధించలేకపోయానే’ అనే దిగులు ఉండేదంట. అప్పుడే ఈ గ్రో అథ్లెట్‌ అనే ఆలోచన వచ్చి స్టార్టప్‌గా మొదలు పెట్టాడు.

విదేశాలలో పని చేశాడు
”చదువు ఒక్కటే జీవితం కాదు, నైపుణ్యమే అసలైన ఆయుధం” అని నమ్మి ముందుకు సాగాడు. స్నేహితులందరూ సరదాగా తిరుగుతుంటే తను మాత్రం కంప్యూటర్‌ ముందు కూర్చుని కోడింగ్‌ నేర్చుకునేవాడు. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని తనని తాను నిరూపించుకున్నాడు. రెండేండ్లుగా ఈ టి-హబ్‌ వ్యవస్థలో పనిచేస్తున్నాడు. ఈక్రమంలో చాలా మంది కార్పొరేట్స్‌ కింద పనిచేశాడు… చేస్తున్నాడు. టీహబ్‌ లో ఇంత చిన్న వయసులో పనిచేయడమనేది అంత ఆషామాషీ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ క్యాంపస్‌, 300 స్టార్టప్స్‌ ఇక్కడ పనిచేస్తుంటాయి. అంతర్జాతీయ ప్రతినిధులు వస్తుంటారు. వాళ్ల పనిని గమనిస్తూ అనేక విషయాలు నేర్చుకున్నాడు. హేమంత్‌కు ఫస్ట్‌ ఇయర్‌ లోనే మెషినింగ్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఇంటర్న్‌ షిప్‌ వచ్చింది. స్టార్టప్‌ కింద పనిచేసే బిజినెస్‌ డెవలప్మెంట్‌ అవకాశం అది. దీంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాడు. స్టార్టప్‌ కింద పనిచేయడంతో తనకు అనుభవం వచ్చింది. ఆ తర్వాత 2 నుంచి 3 నెలల అనంతరం టి-హబ్‌ వాళ్లు తనకు బిజినెస్‌ డెవలప్మెంట్‌ కింద ఒక డీల్‌ ఇచ్చారు. ఆ డీల్‌ తో సౌదీ అరేబియా, యూఏఈ, ఆస్ట్రేలియా, జపాన్‌ లాంటి దేశాలకు చాలా పని చేశాడు.

గ్రో అథ్లెట్‌ ఏంటి?
భారతదేశంలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నప్పటికీ సరైన మార్గదర్శకత్వం, డేటా విశ్లేషణ, స్పాన్సర్‌షిప్‌ అందక వెనుకబడిపోతున్నారు. ఈ లోటును తీర్చడమే లక్ష్యంగా హేమంత్‌ రంగంలోకి దిగాడు. క్రీడాకారుల ప్రదర్శనను డిజిటల్‌ పద్ధతిలో విశ్లేషించి, వారికి అవసరమైన శిక్షణతోపాటు అవకాశాలను కల్పించే ఒక వేదికను అతను రూపొందించాడు. అదే గ్రో అథ్లెట్‌. హేమంత్‌ స్థాపించిన +తీశీష A్‌ష్ట్రశ్రీవ్‌వ నేడు క్రీడా రంగంలో టెక్నాలజీని వాడుతూ కొత్త ఒరవడిని సష్టిస్తోంది. ఒక తెలుగు కుర్రాడు జాతీయ స్థాయిలో ఇంతటి గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా మనందరికీ గర్వకారణం.

చిన్న వయసులోనే సీఈఓ
సాధారణంగా యువత డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగాల కోసం వెతుకుతారు. కానీ హేమంత్‌ బిటెక్‌ మొదటి ఏడాదిలోనే తన స్టార్టప్‌ను విజయవంతంగా నడుపుతూ, ఎంతోమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. 19 ఏండ్ల వయసులోనే, క్రీడా వ్యవస్థలో లోపాలను సరిదిద్దడానికి, భారతీయ అథ్లెట్లు గోల్డ్‌ మెడల్స్‌ సాధించాలనే లక్ష్యంతో కషి చేస్తున్నాడు. క్రీడా రంగానికి సాంకేతికతను జోడించి, యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాడు. కేవలం నిర్వాహకుడిగానే కాకుండా, తానొక అథ్లెట్‌గా కూడా హేమంత్‌ చురుకుగా ఉన్నాడు.

– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -