ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను..

– ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి
నవతెలంగాణ-ఆర్మూర్ :
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. . మండలంలోని అంకాపూర్ ఎమ్మెల్యే స్వగృహంలో ఆదివారం పిఆర్టియు పక్షాన కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్ ఆర్మూర్ అధ్యక్షులు గోపాల్ అర్బన్ అధ్యక్షులు రవికుమార్ ప్రధాన కార్యదర్శి  అశోక్  మల్లారెడ్డి డివిజన్ ఇంచార్జ్ లక్ష్మణ్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొని ఎమ్మెల్యే గారిని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలు పెండింగ్ బిల్స్ పిఆర్సి కమిటీ పెట్టి IR ఇస్తామని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో చెప్పారు. 317 బదిలీలు గురించి వారికి వివరించడం జరిగింది  సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని తెలియజేయడం జరిగింది . మండల మహిళా ఉపాధ్యాయుల కొరకు సంఘ భవన నిర్మాణం కోసం  వెయ్యి గజాల స్థలాన్ని 25 లక్షల రూపాయలు మంజూరు చేయడమైనది అదేవిధంగా మాక్లూర్ మండల్ సంబంధించి మాణిక్ బండారులో వేయి గజాల స్థలం 25 లక్షలు మంజూరు చేయడమైనది. దీనికి పిఆర్టియు పక్షాన జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Spread the love