బడుగు బలహీన వర్గాల వర్గాల సంక్షేమానికి నిర్విరామ కృషి చేస్తాను..

నవతెలంగాణ -ఆర్మూర్
బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి నిర్విరామ కృషి చేస్తారని బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి అన్నారు ..మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఆదివారం ఆయన స్వగృహంలో నందిపేట మండలంలోని బజార్ కొత్తూరు ఉప సర్పంచ్ సాయ గౌడ్ ఆధ్వర్యంలో 100 మందికి పైగా యువకులు మహిళలు బీజేపీ పార్టీలో చేరినారు. ఈ సందర్భంగా పైడి రాకేష్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తూ అవినీతి అక్రమాలకు తావు లేకుండా సేవ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..
Spread the love