అసౌకర్యాల నడుమ ఆదర్శ పాఠశాలలు

– యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్
నవ తెలంగాణ-మల్హర్ రావు
అసౌకర్యాల నడుమ అద్వాన్నంగా ఆదర్శ పాఠశాలలు కొనసాగుతున్నాయని (యువైఏప్ఐ) యువజన బారత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ మోడల్ పాఠశాలతో పాటు కళాశాలల్లో విద్యార్థులకు బోధించడానికి  సరిపడా ఉపాధ్యాయులు లేకపోవడంతో చదువులు సక్రమంగా సాగడం లేదని,దీంతో విద్యార్థులు నష్టపోతున్నట్లుగా తెలిపారు. విద్యార్థులకు మౌలిక వసతులైన తాగునీరు, మరుగుదొడ్లు, స్నానపు గదుల్లో వేడినిరు,తరగతి గదుల్లో ఫ్యాన్లు తదితర అసౌకర్యాల నడుమ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు మోడల్ స్కూళ్ళు, కళాశాలలు,ఎస్సి,ఎస్టీ వసతి,కస్తూరిబ్బా ఆశ్రమ, గృహాలపై పర్యవేక్షణ చేసి విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే యువైఏప్ఐ ఆధ్వర్యంలో పెద్దయెత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
Spread the love