తులం బంగారం ఎగ్గొటెందుకే ఈ పథకాలకు ఎసరు
కాంగ్రెస్ కుట్రలపై బీఆర్‌ఎస్ కదన భేరికి తరలొచ్చిన మహిళలు
నిరసనలకు అనుమతి నిరాకరించడం సహించం: మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ -వనపర్తి
ఆడబిడ్డల ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని నిలిపే కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ పథకాలను ఆపే కుట్ర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వ అంతు తెలుస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ కుట్రలపై బీఆర్‌ఎస్ కదనభేరి పేరిట వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తమ హక్కులు కాపాడుకోవడానికి, కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉప్పెనలా తరలివచ్చిన మహిళలను నిరంజన్ రెడ్డి అభినందించారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ పథకాల రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. ఆనాడు ఆడపిల్లల ఆత్మగౌరాన్ని, ఆర్థిక భరోసా నిలబెట్టడానికి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించారని తెలిపారు. కానీ నేటి సీఎం రేవంత్ రెడ్డి తను ఇచ్చిన హామీ తులం బంగారంపై మహిళల నుంచి వస్తున్న నిరసనను తట్టుకోలేక హైకోర్టులో వేసిన పిటిషన్ లకు కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేసి కళ్యాణ లక్ష్మి, షాధిముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తున్నాడని విమర్శించారు. బాల్య వివాహాలు నిరోధించడానికి పేదప్రజల పేగుబంధాన్ని కాపాడడానికి 2014 అక్టోబర్ 14న రూ.50116తో పథకాన్ని ప్రారంభించి రూ.100116 రూపాయలకు పెంచి కొనసాగించామన్నారు. 2014 నుంచి 2023వరకు 13 లక్షలా 50 వేల మందికి రూ.14 వేల కోట్ల ఆర్థిక భరోసాను కేసీఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. కరోనా కాలంలో కూడా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలతో పాటు లక్షలాది మంది మహిళలకు కేసీఆర్ కిట్టు అందించారని కొనియాడారు. 30 రోజులలో స్టే పై కౌంటర్ దాఖలు చేయడానికి సమయమున్నా ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుతం నిరక్ష్యం చేసిందని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. దశల వారీగా పథకాన్ని రద్దు చేయడానికి కాంగ్రెస్ పార్టీ 2024 నుంచి 2025 వరకూ లక్షా 58 వేల మందికి, 2025 నుంచి 2026 వరకు కేవలం 86 వేల మందికి మాత్రమే కళ్యాణ లక్ష్మి షాధిముబారక్ పథకాలు అందించిందని దుయ్యబట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి లభ్యతతో యాసంగి, వర్షాకాలం పంటలకు నీళ్లు సరిపోతాయన్నారు. ఆంధ్రా ప్రయోజనాలు కాపాడడం కోసం రేవంత్ రెడ్డి మన రైతులకు ద్రోహం చేస్తున్నాడన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో చివరి నీటి బొట్టు కూడా వాడుకునే సౌకర్యం ఉన్నా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంతో ఐదు టి.ఏంసీలు ఆంధ్రా దోచుకెళుతుందన్నారు. 200 రోజులు మోటర్లు నడిపితే మన భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పడావ్ పెట్టడం సహించబోమన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, వాకిటి.శ్రీధర్, నందిమల్ల.అశోక్, గంధం.పరంజ్యోతి, కె.మాణిక్యం మహిళా సర్పంచులు, మహిళలు పాల్గొన్నారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆపితే..ఊరుకోం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



