Wednesday, August 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ?

ఐఆర్‌జీసీతో ట్రంప్‌ తెర వెనుక చర్చలు ?

- Advertisement -

వాషింగ్టన్‌ : ఇరాన్‌తో జూన్‌లో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందాన్ని పొడిగించే ఉద్దేశమేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. అయితే యుద్ధ సమయంలో శక్తివంతంగా ఎదిగి, ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థలో అనేక భాగాలను నియంత్రిస్తున్న ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ)తో ఆయన రహస్య మంతనాలు ప్రారంభించారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆక్సియాస్‌ వార్తాసంస్థ ప్రచురించిన కథనం ప్రకారం…ఐఆర్‌జీసీతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఇరాకీ కుర్దు నాయకుడితో అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్‌ సంస్థ మాజీ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ మాట్లాడారు. ఆ నాయకుడి ద్వారా ఐఆర్‌జీసీ కమాండర్‌ జనరల్‌ అహ్మద్‌ వాహిదీకి అమెరికా ఓ సందేశాన్ని పంపింది. ఈ వార్తను టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో ట్రంప్‌ ధృవీకరించారని ఫాక్స్‌ న్యూస్‌ తెలియజేసింది.
‘నేను వివరాలలోకి వెళ్లడం లేదు. అయితే అమెరికా ప్రభుత్వానికి, ఇరాన్‌ సర్కారులోని కొన్ని విభాగాలకు మధ్య వివిధ రంగాలకు సంబంధించి జరుగుతున్న సంభాషణలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయని మాత్రం చెప్పగలను’ అని ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ సోమవారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -