సచ్చీరులైతే ఆరోపణలను నిరుపించుకోవాలి 

– మాజీ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల సవాల్ 

– ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేయ్యొద్దని సూచన 
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని రేగలపల్లి గ్రామ శివారులో అక్రమించిన ప్రభుత్వ భూమిని వెలికితీస్తామని మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సచ్చీరులైతే ప్రభుత్వ అధికార యంత్రాంగానికి సహకరించి నిరుపించుకోవాలని మండల కాంగ్రెస్ నాయకులు సవాల్ చేశారు.అదివారం మండల కేంద్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యలయ అవరణం వద్ద మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన నిందారోపణలను ఖండించారు.ఈ సందర్భంగా జిల్లాధికార ప్రతనిధి పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు.పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రసమయి బాలకిషన్ ఓటమి పాలవ్వడంతో మతిబ్రమించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేల ఆరోపణలు చేస్తున్నారని.. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం మానుకుని తనపై వచ్చిన ఆరోపణలను చిత్తశుద్ధితో నిరూపించుకోవాలని సూచించారు.ఎమ్మెల్యే అధికారంతో అక్రమాలను ప్రశ్నించిన వారిపై నియంతృత్వం ప్రదర్శించి కేసులు నమోదు చేయించిన ఘనత రసమయి బాలకిషన్ దేనని..ప్రజలిచ్చిన అవకాశాన్ని నిబద్ధతతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ అందరికి పూర్తి స్వేచ్ఛను ప్రసాదించిందన్నారు.గత ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకషన్ సమర్పించిన అఫిడవిట్ యందు రేగులపల్లి శివారులో పొందుపర్చిన భూముల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.నిర్మాణం చేపట్టిన పౌల్ట్రీ ఫాం వద్ద పట్టాభూమితో పాటు కొంత ప్రభుత్వ భూమిని రసమయి అక్రమించుకున్నద వాస్తవం కాదాని ప్రశ్నించారు.ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తూ అక్రమణకు గురైన ప్రభుత్వ భూములను అధారాలతో వెలికితీస్తామని..ప్రజలిచ్చిన తీర్పుతో పదేళ్లు ప్రజాప్రతినిధిగా పనిచేసిన రసమయి బాలకిషన్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించేల వ్యవహరించి అధికారులు తీసుకునే చట్టపరమైన చర్యలకు సహకరించాలని..లేనిపక్షంలో ప్రజలే తగిన నిర్ణయిస్తారన్నారు.తప్పు ఎవరు చేసిన తప్పేనని ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వం,కాంగ్రెస్ నాయకులకు సహేతుకమైన సూచనలు ఇవ్వాలని సూచించారు.
ధరణి బోగస్సేనా: ఒగ్గు దామోదర్ 
మండల కేంద్రం శివారులోని ప్రభుత్వ భూమిని అక్రమించి రియల్ వ్యాపారం చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆరోపించడం అర్థరహితమైందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ఖండించారు.బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించి అమలు చేసిన ధరణి ద్వార యాజమాన్యపు హక్కు కలిగిన మండల కేంద్రానికి చెందిన బోనగిరి భూ లక్ష్మి వద్ద సర్వే నంబర్ 559 యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూమిని కొనుగోలు చేశానని..రసమయి బాలకిషన్ చేసిన అరోపణలు అర్థరహితమైనవని నిరూపించడానికి అధారాలతో సిద్ధంగా ఉన్నానని దామోదర్ సవాల్ చేశారు.
మీ హయాంలో సక్రమాలు..మా హయాంలో అక్రమాలా..?
ఎమ్మెల్యేగా వ్యవహరించిన పదేళ్ల కాలంలో తన అనుచరులు చేసిన ఇసుక, మట్టి దందా,భూ కబ్జాలన్ని సక్రమాలు..మా హయాంలో ప్రజా అవసరాల కోసం చేసేటేవన్ని అక్రమాలా?అని యువజన కాంగ్రెస్ మండలధ్యక్షుడు మంకాల ప్రవీన్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను ప్రశ్నించారు.మండల కేంద్రంలో రజకుల జీవనోపాధైనా సుమారు 1.16 ఎకరాల భూమిని మీ అనుచరుడు కబ్జా చేసి వారి పొట్టాడని అ భూ కబ్జా మీకు అక్రమంగా కనిపించడం లేదాని రసమయి బాలకిషన్ పై ప్రవీన్ అసహనం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అక్రమాలను అధాథాలతో నిరుపిస్తామని ప్రవీన్ హెచ్చరించారు.నాయకలు పులి సంతోష్,మచ్చ కుమార్,బండిపెల్లి రాజు,బోనగిరి మహేందర్,జెల్లా ప్రభాకర్,రాములు పాల్గొన్నారు.
Spread the love