మీ ఫోన్‌లో ఈ రెండు యాప్‌లు ఉంటే వెంటనే తొలగించండి!

నవతెలంగాణ-హైదరాబాద్ : యూజర్‌ గోప్యత కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు గూగుల్ తెలిపింది. అయితే, కొందరు యాప్‌ డెవలపర్లు, హ్యాకర్లు యూజర్‌ డేటాను దొంగలించేందుకు కొత్త పంథాను ఎంచుకున్నట్లు ప్రాడియో అనే మొబైల్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ప్లేస్టోర్‌లో యాప్‌ వివరాల్లో డేటా సేకరించట్లేదని చెబుతూ.. యూజర్లకు సంబంధించిన సమాచారాన్ని పలు సంస్థలకు చేరవేస్తున్నాయని ప్రాడియో తెలిపింది. చైనాకు చెందిన వాంగ్ టామ్‌ అనే డెవలపర్‌ డిజైన్‌ చేసిన ఫైల్‌ రికవరీ అండ్ డేటా రికవరీ, ఫైల్‌ మేనేజర్‌ అనే రెండు యాప్‌లు యూజర్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌, లొకేషన్‌, మొబైల్‌ కంట్రీ కోడ్‌, నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ నేమ్‌, నెట్‌వర్క్‌ కోడ్‌, పోన్‌ తయారీ కంపెనీ, మోడల్‌ వంటి వివరాలను సేకరిస్తూ.. యాప్‌లో యూజర్ల యాక్టివిటీలపై నిఘా ఉంచినట్లు నివేదికలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ రెండు యాప్‌లను సుమారు 10 లక్షల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. యూజర్లు వెంటనే ఈ యాప్‌లను తమ డివైజ్‌ల నుంచి డిలీట్ చేయాలని సూచించింది. ఇలాంటి యాప్‌ల పట్ల యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సూచించింది.

Spread the love