ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు..!

– అధికారుల తీరుపై గ్రామంలో విమర్శలు

– అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని గ్రామస్తుల విజ్ఞప్తి
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని గూడెం గ్రామంలోని సర్వేనంబర్ 236 యందు అక్రమ నిర్మాణాలు తొలగించి జనవరి 5,2023న తహసిల్దార్ విజయ ప్రకాశ్ రావు సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి ప్రభుత్వాధికారులు స్వాదీనం చేసుకున్నారు. గ్రామాభివృద్ధి అవసరాల దృష్ట్యా అధికారులు ప్రణాళిక రూపోదించి భూమిని అందజేయడానికి సంసిద్దులయ్యారు. ప్రభుత్వాధికారులు స్వాదీనం చేసుకున్న భూమిలో గ్రామంలో కొందరు మళ్లీ అక్రమ నిర్మాణాలు చేపడుతూ భూమిని అక్రమించే యత్నం చేస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.ప్రభుత్వ భూమిని అక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అధికారులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్న తీరుపై గ్రామంలో విమర్శలు వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహించకుండా అక్రమ నిర్మాణాలపై సత్వరమే చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.అక్రమ నిర్మాణాలపై తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన ఎనాటికైనా తొలగిస్తామని..ఎవరూ అక్రమ నిర్మాణాలకు పాల్పడి నష్టపోవద్దని తెలిపారు.అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు చేపడుతామని తహసిల్దార్ హెచ్చరించారు.
Spread the love