-టాస్క్ ఫోర్స్ అధికారుల దాడితో వెలుగులోకి..
-దాచారం శివారుల్లో భారీగా ఇసుక అక్రమ నిల్వ పట్టివేత
-ఎస్ఐ బదిలీ సాకుతో గాగీళ్లపూర్ మాఫీయదారుల ఇష్టారాజ్యం
-ట్రాక్టర్ పట్టివేత..ఠాణాకు తరలింపు
నవతెలంగాణ-బెజ్జంకి
చట్టప్రకారం విధులు నిర్వర్తించిన ఎస్ఐ బదిలీ అంశం మండలంలో చర్చనీయాంశమైతే..మరోపక్క ఇసుక మాఫీయదారులకు వరంగా మారింది. బదిలీ సాకుతో మండల పరిధిలోని గాగీళ్లపూర్ గ్రామంలోని పలువురు ఇసుక అక్రమ రవాణదారులు ఇసుక అక్రమ నిల్వలేర్పాటు చేసి మళ్లీ ఇసుక దందాకు తేరలేపారు.మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో మండల పరిధిలోని దాచారం శీవారులో అక్రమ నిల్వ చేసి భారీ నిల్వలు వెలుగులోకి వచ్చాయి.అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని పట్టుబడిన ట్రాక్టరును ఠాణాకు తరలించారు.
ఎస్ఐ బదిలీ సాకుతో ఇష్టారాజ్యం..
జాన్,2025లో ఎస్ఐగా భాధ్యతలు చేపట్టి సౌజన్య చట్టాన్ని మండలంలో అమలు చేసి పోలీసింగ్ కు సరి కొత్త నిర్వచనంగా నిలిచారు.దీంతో ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట పడింది.ఇటీవల ఎస్ఐ బదిలీ సాకుతో ఇసుక మాఫీయదారులు మళ్లీ రెచ్చిపోయి యథేచ్ఛగా అక్రమ ఇసుక నిల్వలేర్పాటు చేయడం మమ్మల్ని ఇంకవరూ అపేవారు లేరనే సంకేతానికి నిదర్శనంగా నిలుస్తోంది.నూతనంగా నియమాకమైన ఎస్ఐ భాధ్యతలు చేపట్టి పోలీసింగ్ ను మరింత పటిష్టంగా అమలు చేసి అక్రమార్కులకు అడ్డుకట్ట వేస్తారా?లేకా చూసిచూడనట్టు వ్యవహరించి అక్రమార్కులకు వత్తాసు పలుకుతారో కొంతకాలం వేచిచూడాలి.
సోషల్ మీడియాలో చర్చ..
భారీగా అక్రమ ఇసుక నిల్వ పట్టబడడంతో సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్,బీఆర్ఎస్ శ్రేణుల మద్య చర్చకు దారి తీసింది.కాంగ్రెస్ శ్రేణులు ఇందిరమ్మ ఇండ్ల పేరునా సామాన్యునికి అందించకుండా అధికారులతో కుమ్మక్కై ఇసుక అక్రమ రవాణకు తేరలేపి దోపిడీకి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించడం చర్చనీయాంశమైంది.
కేసు నమోదు ..
దాచారం గ్రామ శివారులో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను స్వాధీనం చేసుకుని పట్టుబడిన ట్రాక్టర్ పై కేసు నమోదు చేశామని…పై అధికారుల అధేశానుసారం చట్టపరమైన చర్యలు చేపడుతామని ఎస్ఐ సౌజన్య తెలిపారు.



