
త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా గురువారం హైదరాబాద్లోని కాంగ్రెస్ భవన్లో ఎలక్షన్ ఇన్చార్జ్ శరత్ గౌడ్ కు దరఖాస్తు చేసినట్లు ధర్పల్లి మాజీ ఎంపీపీ ,ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోన్ని రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశించే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు. అయన వేంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెలిమెల నర్సయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు.