అక్షరాల ఆకలి తీరాల్సిన వయసులో…
అన్నం మెతుకుల కోసం అనాధల అన్వేషణ!
చదువుల తల్లి ఒడిలో సేద తీరాల్సిన పాదాలు…
మురికి కూపపు ముళ్లబాటలో రక్తమోడుతున్నాయి!
రంగుల ప్రపంచ వెలివేసినా..
చిరిగిన దుస్తులు వెనుక దాగిన ఎన్నో ఆశలు!
చెత్త కుప్పలే నివాసాలు…
విసిరేసిన వ్యర్థాలు జీవనాధారాలు!
ఓ పక్కన ధనికులు అహంకారపు మేడల నీడలు…
మరో పక్కన చితికిన బతుకుల మురికి వాడలు!
సామాజిక అసమానతల సాక్షిగా…
నిలువునా బలైపోతోంది పసిడి బాల్యం!
”నేటి బాలలే రేపటి పౌరులు” అనే నినాదం..
అనాధల ఆకలి కేకల ముందు వెలవెలబోతోంది!
బొమ్మలతో ముచ్చట్లాడాల్సిన చిట్టి చేతులు…
బతుకు బండిని లాగలేక భారంగా కదులుతున్నాయి!
అనాధల ఆకలి కేకలను ఆలకించి,
చేతిలో పుస్తక కలాలు పెట్టి,
గుండె నిండా ధైర్యం నింపి,
కొత్త వెలుగుల బాటను నిర్మించి,
కళ్ళల్లో ఆశల రేఖను చూపలేవా…
మా నవ నాగరిక సమాజమా!
ననుబోలు రాజశేఖర్, 9885739808,
అభివృద్ధి నీడన… అనాథ బాల్యం!
- Advertisement -
- Advertisement -



