– పలువురు బీఆర్ఎస్ యువ నాయకులపై ఆరోపణలు
– గత ప్రభుత్వంలో చేసిన తప్పుల రక్షణకేనని విమర్శలు
నవతెలంగాణ – బెజ్జంకి
ఒకప్పుడు మీడియా రంగం ఎంతో విలువలతో కూడుకున్నది. కాని నేడు మీడియా రంగంలో కనీస అవగాహన,అర్హత లేని వారు సైతం అరగేట్రం చేస్తుండడంతో మీడియా రంగం మండలంలో భ్రష్టు పడుతోంది.గత ప్రభుత్వంలో స్థానిక రాజకీయ నాయకులకు అనుచరులుగా వ్యవహరించిన వారు..ప్రభుత్వం మారడంతోనే మీడియా రంగాన్ని ఎంచుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మాజీ ప్రజాప్రతినిధుల అండతో ఇష్టారాజ్యాంగ వ్యవహరించిన బీఆర్ఎస్ యువ నాయకులు నేడు అచేతన స్థితికి చేరడంతో మీడియా రంగంలో అరగేట్రం చేస్తున్నారని మండలంలోని పలువురు కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. గత ప్రభుత్వ అధికారంలోని ప్రజాప్రతినిధుల అండతో విచ్చలవిడిగా వ్యవహరించి తప్పులు చేసిన పలువురు యువ నాయకులు మీడియా రంగంలో చేరడం వారి చేసిన తప్పుల రక్షణకేనని కాంగ్రెస్ నాయకులు అగ్రహం వ్యక్తం చేశారు. నిస్వార్థ భావజాలంతో పనిచేసే మీడియా విలువలను స్వార్థ రాజకీయ ఆలోచనలో మీడియా రంగాన్ని భ్రష్టు పట్టించవద్దని..గత ప్రభుత్వంలో పలువురు యువ నాయకులు ప్రజా సేవ పేరుతో చేసిన మోసాలు ఎప్పటికైనా బహిర్గతమవుతాయని కాంగ్రెస్ శ్రేణులు సూచించారు.