– తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల్ని మార్చి 31వ తేదీ లోపు క్లియర్ చేస్తే ప్రభుత్వానికి దాదాపు రూ.50వేల కోట్ల ఆదాయం వస్తుందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దీనికోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా గ్రామ పంచాయితీ లే అవుట్లలోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కడితే రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభిస్తుందనీ, దీనివల్ల అనేకమందికి లబ్ది చేకూరుతుందని వివరించారు. అయితే నిర్ణీత గడువులోపు ఎల్‌ఆర్‌ఎస్ బకాయిలు మొత్తం కట్టాలంటే యజమానులకూ ఇబ్బందేననీ, ఆయా ప్లాట్లలో ఇండ్లు నిర్మించుకొనే సమయంలో మిగిలిన సొమ్మును చెల్లించే వెసులుబాలు కల్పించాలని కోరారు.