Friday, September 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్స పెంచండి

జీవన శైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు, చికిత్స పెంచండి

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలివాదుల పై ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని సమీక్షను నిర్వహించడానికి డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ వైద్యులు డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా విచ్చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్వాసి మాట్లాడుతూ.. జీవనశైలి వ్యాధులు ముఖ్యంగా హైపర్ టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను ఆరోజు ఉప కేంద్రాల వారిగా గ్రామాల వారీగా ప్రతి ఒక్కఆశ ప్రతిరోజు పదిమంది 30 సంవత్సరాల పైబడిన వారికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లయితే జిల్లావ్యాప్తంగా పెండింగ్ స్క్రీనింగ్ ఈ నెల చివరి వరకు పూర్తి చేయవచ్చన్నారు.

30 సంవత్సరాల పైబడిన వారిలో 26% గుండెజబ్బుల కోసం 13 శాతం మధుమేహం వ్యాధిగ్రస్తులు ఉంటారని , మొత్తం పాపులేషన్ లో 56% 36 సంవత్సరాల పైబడిన వారు ఉంటారని వారికి నిర్ధారణ పరీక్షలు పూర్తిచేసి చికిత్స ప్రారంభించాలన్నారు. అదేవిధంగా ఈపాటికే ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న పాజిటివ్ కేసులు అన్నింటిని ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏ బి హెచ్ ఎ  కార్డుల కొరకు ఇంకా నమోదు చేయని వారు 100% పూర్తి చేయాలన్నారు. స్థాయిలో మరియు ఆరోగ్య ఉపకేంద్రస్థాయిలో ప్రతినెల 5వ తేదీ లోపు నమోదు చేయాలన్నారు. ఇంకా హైపర్ టెన్షన్ మరియు డయాబెటిస్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ పై వివిధ పీహెచ్సీ ల వైద్యాధికారులకు 

పిపిటి ప్రజెంటేషన్ ద్వారా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రాజ శ్రీ మాట్లాడుతూ.. జీవన శైలి వ్యాధులతో పాటు మిగతా జాతి ఆరోగ్య కార్యక్రమాలను ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్య సేవలు, క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను విస్తృతంగా నిర్వహిస్తూ నూతన కేసులకు చికిత్స అందించాలని, వివిధ శాఖల సమన్వయంతో, మరియు మండల స్థాయి స్పెషల్ ఆఫీసర్ సహకారంతో టీబీ ఎంబీఏ కార్యక్రమాన్ని ప్రతి పీహెచ్సీ స్థాయిలో పోషణ కిట్లను క్షయ వ్యాధి గ్రాస్తులకు అందించడం, పోషకాహారం కోసం క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా ఇచ్చే వెయ్యి రూపాయలను అందించే డిబిటీ ని 100% పూర్తి చేయాలన్నారు.

ఈ ఆరోగ్యాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, ఈ ఔషధీలో అవసరమైన మరియు పంపిణీ చేసిన ఔషధాలను నమోదు చేయాలని అన్నారు. వ్యాధినిధులకు టీకాలను ప్రతి పీహెచ్సీలో నిర్వహించే 100% పూర్తి చేయాలని, హెచ్పివి వ్యాక్సినేషన్ ను అర్హులైన 14 సంవత్సరాల బాలికలు అందరికీ అందజేయాలని తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డి ఐ ఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ సికందర్ నాయక్, పివో ఎన్ సి డి డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, ఎన్సిడి కోఆర్డినేటర్ వెంకటేష్, డిహెచ్ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, డిడిఏం నారాయణ, డిపిఓ విశాల, మరియు వివిధ పీహెచ్సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -