రిటైర్‌మెంట్‌ ఏజ్‌ పెంపు

న్యూఢిల్లీ : కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏండ్లకు కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను ఎక్కువ కాలం పొందడం వల్ల పరిపాలన మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తుది. వాస్తవానికి ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా..మరోవైపు ఇప్పుడున్న ఉద్యోగుల పదవీవిరమణ వయస్సు పెంచటంపై నిరుద్యోగుల్లో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు ముందుగా కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదం పొందటం గమనార్హం. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1, 2025 నుంచి అమల్లోకి వస్తుంది.

Spread the love