Saturday, May 9, 2026
E-PAPER
Homeజాతీయంహంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు

హంటా వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు లేదు

- Advertisement -

– ఎన్‌ఐవీ
న్యూఢిల్లీ: క్రూజ్‌ నౌక ఎంవీ హిండియస్‌లో హంటా వైరస్‌ వ్యాప్తి కలవరపాటుకు గురిచేస్తోంది. ముఖ్యంగా నౌకా సిబ్బందిలో ఇద్దరు భారతీయులు ఉండటం మరింత ఆందోళనకు కారణ మవుతోంది. ఈ పరిణా మాలపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ( ఎన్‌ఐవీ) డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ స్పందించారు. ఈ వైరస్‌ కేసులు అక్కడక్కడ కనిపిస్తున్నాయని, వైరస్‌తో భారత్‌కు తక్షణ ముప్పు ఏమీ లేదన్నారు. ప్రస్తుతానికి సామూహిక వ్యాప్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవన్నారు.

”ఈ వైరస్‌ మానవుల నుంచి మానవులకు సంక్రమించడం చాలా అరుదు. ఆసియా, ఐరోపా దేశాల్లో వెలుగు చూసే ఈ వైరస్‌ మానవుల మధ్య సోకదు. ఆండెస్‌ వైరస్‌ వంటి కొన్ని దక్షిణ అమెరికా జాతుల్లో మాత్రమే ఇలా వ్యాప్తిచెందినట్లు రికార్డులున్నాయి” అని ఎన్‌ఐవీ డైరెక్టర్‌ వెల్లడించారు.

ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు..
ఇది కోవిడ్‌, ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌ కాదని నవీన్‌ కుమార్‌ స్పష్టం చేశారు. తొలుత ఫ్లూ మాదిరి లక్షణాలు కనిపిస్తాయని, వైరస్‌ సోకిన ఒకటి నుంచి ఐదు వారాల్లో లక్షణాలు బయటపడతాయన్నారు. దేశంలో ఇటువంటి అనుమానిత వైరస్‌ కేసులను గుర్తించడానికి అవసరమైన ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. నౌకలు, గిడ్డంగులు, స్టోరేజీ కేంద్రాలు, గాలి ప్రసరణ సరిగాలేని ప్రదేశాల్లో పనిచేసే వ్యక్తులు పరిశుభ్రత పాటించాలని, ఎలుకలు ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని ఎన్‌ఐవీ డైరెక్టర్‌ సూచించారు.

మరిన్ని కేసులు..
ఇది తీవ్ర పరిణామమే అయినప్పటికీ.. దీని వల్ల ప్రజారోగ్య ముప్పు తక్కువగానే ఉన్నట్టు అంచనా వేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. అయితే, వైరస్‌ పొదిగే కాలాన్ని దష్టిలో ఉంచుకొని.. మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి మరియా వాన్‌ మాట్లాడుతూ.. ఈ వైరస్‌ భిన్నంగా వ్యాప్తి చెందుతోందని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -