- Advertisement -
హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.3,103 కోట్ల నికర లాభాలు సాధించింది. చెన్నరు కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంక్ గతేడాది ఇదే సమయంలో రూ. 2,956 కోట్లుగా నమోదయ్యింది. గడిచిన క్యూ4లో రిటైల్ వ్యాపారం 18.72 శాతం పెరిగి రూ. 1,41, 396 కోట్లకు చేరింది. మొండి బకాయిలు 1.98 శాతానికి తగ్గి ఆస్తుల నాణ్యత మెరుగు పడటం తో పాటు, బ్యాంక్ తన వాటాదారు లకు ప్రతి షేరుకు రూ. 18.25 డివిడెండ్‌ను ప్రకటిం చింది. మరో వైపు భవిష్యత్తు అవసరాల కోసం రూ. 5,000 కోట్ల నిధుల సమీకర ణకు బోర్డు ఆమోదం తెలిపింది.
- Advertisement -



