Monday, May 11, 2026
E-PAPER
Homeజాతీయంవిలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు

విలాసాల కంటే- నిత్యావసరాలకే భారతీయుల మొగ్గు

- Advertisement -

వార్ దెబ్బకు అర్థవంతమైన ఖర్చులకు ప్రాధాన్యం : డెలాయిట్ రిపోర్టు
న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం దెబ్బకు ప్రపంచమంతా తలకిందులైంది. 70 రోజులైనా..యుద్ధ భయం వెంటాడుతూనే ఉన్నది.ఈ నేపథ్యంలో మారుతున్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ వినియోగదారులు తమ ఆకాంక్షలను, ఆర్థిక క్రమశిక్షణను సమతుల్యం చేసుకుంటున్నారని డెలాయిట్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. భారతీయులు విలాసాల కంటే, నిత్యావసరాలకు, అర్థవంతమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం చేసింది. డెలాయిట్ ‘కన్జూమర్ సిగ్నల్స్ ఇండియా చాప్టర్’ తన తాజా సంచికలో కీలక విషయాలను వెల్లడించింది. మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వినియోగదారులు తమను తాము మలుచుకుంటున్నారని, ఇది వారిలో నిర్మాణాత్మక స్థితిస్థాపకతను చాటిచెబుతోందని తెలిపింది. అయితే భారతీయులు తమ దీర్ఘకాలిక జీవనశైలి ఆకాంక్షలతో రాజీ పడకుండానే, ఈ మార్పులను స్వీకరిస్తున్నారని స్పష్టం చేసింది.

ట్రెండ్ మారుతోంది!
నేటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక పరిణామాల
“వాహనాల విషయానికి వస్తే, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ, కొనుగోలు చేయాలనే ఉద్దేశం మాత్రం తగ్గింది. ఇది భారీ ఖర్చుతో కూడిన కొనుగోళ్ల విషయంలో వినియోగదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని, కానీ దీర్ఘకాలికంగా చూస్తే, ప్రజలు నూతన సాంకేతికలపై ఆసక్తి చూపుతున్నారని సూచిస్తోంది” అని రామనాథన్ పేర్కొన్నారు.

ఆర్థిక స్థితిగతులు
2026 మార్చి నాటికి భారతదేశ ఫైనాన్షియల్ వెల్బీయింగ్ ఇండెక్స్ (FWBI) 111.1కి చేరింది. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2025 మార్చిలో ఉన్న 109.1 కంటే ఇది మెరుగుపడింది. ఇక గ్లోబల్ సగటు (102.7), ఆసియా పసిఫిక్ సగటు (102.0)లతో పోలిస్తే ఇండియన్ ఎఫ్డబ్ల్యూబీఐ ఎంతో మెరుగ్గా ఉంది. అయితే భారత్లో అత్యవసరం కాని, భారీ ఖర్చుతో కూడిన కొనుగోళ్లపై ఆసక్తి 5 పాయింట్లు తగ్గి 65 శాతానికి చేరుకుంది. ఇది వినియోగదారులు ఆర్థిక అంశాలపై ఎంతో జాగరూకతతో ఉన్నారో తెలుపుతుంది.

ధరల పెరుగుదలపై ఆందోళన
‘భారతదేశంలో దాదాపు 73 శాతం మంది వినియోగదారులు వచ్చే నెలలో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా నీరు, విద్యుత్, ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళన వినియోగదారుల్లో పెరిగింది’ అని నివేదిక పేర్కొంది. పట్ల పెరుగుతున్న ఆందోళనలు వినియోగదారుల సెంటిమెంట్ను, స్వల్పకాలిక నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. అందుకే నేడు భారతీయ వినియోగదారులు ఖర్చు చేసే తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని డెలాయిట్ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఇండియన్స్ ప్రధానంగా అత్యవసర ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపింది. నిత్యావసరాలు కాకుండా ఇతర ఖర్చులు చేయడం అనేది కేవలం కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైందని వెల్లడించింది.
“ప్రయాణాల విషయానికి వస్తే, పండుగ సీజన్ తర్వాత సాధారణ ప్రయాణాలు చేసే ఉద్దేశం తగ్గుతోంది. కానీ ప్రయాణం చేసేటప్పుడు ‘ప్రీమియమైజేషన్’కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే, భారతీయ వినియోగదారులు విలువ, సౌకర్యం, విశ్వసనీయతలకు అధిక ప్రధాన్యం ఇస్తున్నారు. వారు ప్రస్తుతం క్రమబద్ధీకరించిన వినియోగ దశలోకి ప్రవేశిస్తున్నారు. క్రమంగా వారు మరింత పరిణితి చెందుతూ, ఆర్థిక క్రమశిక్షణతో, సరైన నిర్ణయాలు తీసుకుంటూ తమ ఆకాంక్షలను సమతుల్యం చేసుకుంటున్నారు” అని డెలాయిట్ దక్షిణాసియా పార్ట్నర్ అండ్ ఇండస్ట్రీ లీడర్ ఆనంద్ రామనాథన్ తెలిపారు. భారతీయ కుటుంబాలు తమ ఖర్చుల విషయంలో ఎక్కడ విలువ ఉంటుందో స్పష్టమైన అవగాహనతో ఉన్నాయని రామనాథన్ పేర్కొన్నారు. నిత్యావసరాలకు ప్రాధాన్యత ఇస్తూనే తమ అనుభవాలను మెరుగుపరుచుకుంటున్నారని, అదే సమయంలో పెద్దపెద్ద ఆర్థిక కమిట్మెంట్లను వాదియా వేస్తున్నారని చెప్పారు.

పొదుపు పెరుగుతోంది!
మరోవైపు భారతీయ వినియోగదారులు ఆహార వ్యయాల్లో పొదుపు పాటిస్తున్నారని, స్థిరమైన పొదుపు వైపు మొగ్గు చూపుతున్నారని రామనాథన్ తెలిపారు. అంతేకాదు ఆహార పదార్థాల విషయంలో నాణ్యతకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అర్థవంతమైన ఖర్చులు మాత్రమే చేయడం, పొదుపు, ఆకాంక్షల మధ్య సమతుల్యత పాటించడం లాంటివి చేస్తున్నారని అన్నారు. ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ప్రజలు మారుతున్నారని, విలువ, నాణ్యత, అనుభవాలకే అధిక ప్రధాన్యత ఇస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆహార పొదుపు సూచీ
భారత ఫుడ్ ఫ్రూగాలిటీ ఇండెక్స్ (ఎఫ్ఎఫ్ఐ) 98.3కి చేరింది. 31 శాతం మంది వనియోగదారులు ఆహారం వృథా కాకుండా చూసుకుంటున్నారు. 11 శాతం మంది అవసరమైన దానికంటే తక్కువగా ఆహారం కొంటున్నామని చెప్పారు. 12 శాతం మంది తక్కువ ధరకు దొరికే ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలను కొంటున్నారు. ఇది వినియోగదారులు నాణ్యతతో రాజీపడకుండా, ఖర్చులను సమర్థవంతంగా తగ్గించుకోవడాన్ని తెలుపుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -