
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నత విద్యనభ్యసించిన యువతకు అన్యాయమే జరిగిందని కవ్వంపల్లి యువసేన వ్యవస్థాపకుడు కత్తి రమేశ్ అసహనం వ్యక్తం చేశారు.సోమవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కత్తి రమేశ్ మాట్లాడారు.కుటుంబంలో ఒక యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే అ కుటుంబ సభ్యులు ప్రభుత్వ పథకాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని యువతకు ఉద్యోగ కల్పనే ద్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రథమ ప్రాధాన్యతను ఇస్తుందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించాలని యువతను విజ్ఞప్తి చేశారు. నాయకులు మానాల రవి,లింగాల శ్రీనివాస్,శంకర్ పాల్గొన్నారు.