Friday, May 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంతర జిల్లాల వాహనాల దొంగ అరెస్ట్

అంతర జిల్లాల వాహనాల దొంగ అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహ నాలను దొంగలించి తప్పించుకు తిరుగుతున్న అంతర జిల్లాల నిందితుడిని పట్టుకున్నామని వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలి పారు. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్గల్ మండలం శివపురం గ్రామానికి చెందిన వదేరా నవీన్ ప్రస్తుతం నిజామాబాద్లోని నాందేవావాడ ప్రాంతంలో నివాసం ఉంటూ ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నాడు. నాలుగు నెలల నుంచి అతడు వన్ టౌన్ పరిధిలో మూడు ద్విచక్ర వాహనాలు, ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో ఒక బైక్, బాన్సు వాడ, పిట్లం పీఎస్ల పరిధిలో ఒకటి చొప్పున మొత్తం ఆరు ద్విచక్ర వాహనాలను దొంగలించాడు. నిజామాబాద్ రైల్వేఓవర్ బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడినట్లుగా అంగీకరించినట్లు తెలిపారు. దీంతో నవీన్ పై కేసు నమోదు చేసి దొంగలించిన ద్విచక్ర వాహనాలను స్వాదీనం చేసుకుని నిందితున్ని రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్ఓ వెల్లడించారు. సదరు నిందితుడు దొంగలించిన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసిన కామారెడ్డి జిల్లా సోమేశ్వరం గ్రామానికి చెందిన మహ్మద్ మొహీజ్, అలకుంట మోహన్ కు నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఎవరైనా దొంగలించిన వాహనాలు, సెల్ఫోన్లను కొంటే వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం  జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -