Sunday, April 19, 2026
E-PAPER
Homeకవితఅంతర్మథనం

అంతర్మథనం

- Advertisement -

బాహ్య ప్రపంచపు
పరిధులు దాటి
నాలోని శూన్యపు లోతుల్లోకి సాగుతున్నా!
ముఖానికి తగిలించుకున్న
వేల ముసుగులను ఒలిచి,
నగంగా నిలిచిన
నా అస్తిత్వాన్ని దర్శిస్తున్నా!
సమాజపు అంచనాల చట్రంలో ఇమడలేక,
అనుకరణల ప్రవాహంలో కొట్టుకుపోలేక,
నా మౌన అరణ్యంలో నేనొక ఏకాకి బాటసారిని!
అక్కడ వినిపించే ప్రతి ధ్వని నా ఆవేదనే,
అక్కడ ప్రతిబింబించే ప్రతి దశ్యం
నా ఆత్మాన్వేషణే!
ఓటములకు కుంగిపోని,
గెలుపులకు పొంగిపోని,
ఒక స్థితప్రజ్ఞత వైపు నా ప్రయాణం!
లోకానికి నేను మౌనంగా కనిపించవచ్చు,
కానీ నాలో నేను ఒక మహా సముద్రమంత ఘోషిస్తున్నాను!
నిశ్శబ్దాన్ని ఆయుధంగా చేసుకుని,
నన్ను నేను పునర్నిర్మించుకుంటున్నాను!
మడియా వల్లభరావు, 8985019884

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -