సుదీర్ఘ విరామ చిహ్నమో
విధ్వంసానికి విశ్రాంతో కాదిది
యుద్ధం అలారం ఆగింది
శాంతి వీచికల బరువు
ప్రవాహ ప్రయాణం
లక్షల గుండె లయలకు
ఊపిరి ఉషోదయ
నినాదమై నిలిచింది..!
శిథిలాల శకలాల మౌన రోదనల
స్వరాల శవాల మధ్యే…
మళ్ళీ బతుకు సైరన్ మోగింది
ఆకలి క్షిపణుల ఆరాటం
ఆశల ఆకాశం గుండెను
నిలువునా చీల్చుతుంది
శతాబ్దాల అసమానత
బాంబుల వర్షం దట్టమైన
నిరాశా నిస్పహల
మధ్య కురుస్తూనే ఉంది
అంతర్యుద్ధం ఆనాది
నుండి పతాక శీర్షికే..!
ప్రత్యర్ధుల యుద్ధంలో చావు..
పరిస్థితుల యుద్ధంలో బతుకు..
రెండూ విభిన్న ధవాల పోరాటాలే
ఒకే జీవిత అయస్కాంతానికి..!
యస్… మళ్లీ కొత్త ప్రశ్న మొదలైంది
జీవితం ఎప్పుడూ ఓ రణరంగమే
నిరుపేదల బ్రతుకు ఎప్పుడూ మెతుకుల యుద్ధమే..!
అక్షరాలు అందుకోలేని
కోట్లాది మంది బ్రతుకు సాహిత్యంలో
ఆకలి సంగీతం జగమంతా వినిపిస్తూనే ఉంది..!
మానవత్వం వికసించనంత కాలం…
యుద్ధం ఎవ్వరూ ఆపలేని నిరంతర ప్రక్రియ..!
ఎవరితో ఎందుకో అనేది ఇప్పుడు ప్రశ్న..!!
శతాబ్దాలుగా ఎన్నో జవాబులు
ఈ ప్రశ్నపై యుద్ధం చేస్తుంటే…
దేశం-ద్వేషాల మధ్య
దేహాలు ముక్కలవుతూనే ఉన్నాయి..!!
ఫిజిక్స్ అరుణ్ కుమార్, 9394749536
ప్రశ్నగానే మిగిలిపోతుంది..!
- Advertisement -
- Advertisement -



