- Advertisement -
జెండాలెన్నైనా.. అజెండాలెన్నైనా..
ఆమె ఆకాశంలో సగం అన్నా
అవకాశాల్లో అర్ధభాగం అన్నా
బిల్లు ముందుకొచ్చేసరికి అన్ని పార్టీలు సమానమే
వేదికలెక్కితే స్త్రీ శక్తి ఉపన్యాసాలు
సభ రభసలో – అన్నీ పాత అభ్యాసాలు.
ఒకరు ఆమోదం అంటారు,
ఇంకొకరు అభ్యంతరం అంటారు
ముప్పై మూడు శాతానికి
ఎన్ని అ(వి)ఘాతాలు
నినాదాల వివాదాల మధ్య నలిగిపోతున్నది
కేవలం కాగితం కాదు… కోట్లాది మహిళల కల!
‘ఢ’ లిమిటేషన్ – లిటిగేషన్ ఏదైతేనేం
ఏ పార్టీ వెనకడుగు వేస్తేనేం
ప్రజాస్వామ్యానికే పెను గాయం,
మగువలు గెలవని రాజ్యాన
మనుగడకైనా ఉంటుందా గమ్యం?
తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి, 8008 577 834
- Advertisement -


