డాక్టర్ పొన్నాల బాలయ్య రచన “లంద” నవల ఆవిష్కరణ సభ ఈ నెల 14న హైదరాబాద్ రవీంద్రభారతి మొదటి అంతస్తు మినీ హాల్ లో.. మధ్యాహ్నం 1: 30 నిమిషాలకు.. కె. రంగాచార్య, డాక్టర్: నందిని సిధారెడ్డి ప్రొఫెసర్ డాక్టర్ కాశీం పాల్గొంటారు.
ఆటా సాహిత్య పోటీలు
అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 19వ మహాసభలు బాల్టీమోర్ నగరంలో జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘ఆటా’ సాహిత్య విభాగం అంతర్జాతీయ స్థాయిలో తెలుగులో నవలల పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు వేణు నక్షత్రం తెలిపారు. అమెరికా జాతీయ స్థాయిలో కథల, కవితల పోటీలను వివిధ నగరాల్లో ప్రత్యక్ష పఠన రూపంలో నిర్వహిస్తారు. ఆగస్టు 1న పుస్తకావిష్కరణలు, స్వాగతోపన్యాసం, కవిత్వం ఫైనల్స్, కథల ఫైనల్స్, ఆగస్టు 2న అవధానం, వక్తల ప్రసంగాలు, సాహిత్య అభిమానుల కోసం ప్రత్యేక వేదిక, కథల–కవితల పోటీల ఫలితాల ప్రకటన, బహుమతి ప్రదానోత్సవం జరగనున్నాయి. సాహిత్య కార్యక్రమాల్లో ప్రవేశం పూర్తిగా ఉచితం. సాహిత్య కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆటా అధికారిక వెబ్‌సైట్లను సందర్శించాలని నిర్వాహకులు కోరారు. వేణు నక్షత్రం, సాహిత్య కమిటీ చైర్మన్
హెచ్ఆర్సీ2026సాహిత్య పురస్కారాలకు ఆహ్వానం
హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్ 2026 పురస్కారాలకోసం కథలు, కవిత్వ సంపుటాలను ఆహ్వానిస్తున్నాము. కథలు ప్రకృతి పర్యావరణం ఇతివృత్తాలతో సామాజిక సందేశంతో కూడినవై ఉండాలి. కవితా సంపుటాలకు అంశం లేదు. 2025 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో ఆవిష్కరించిన కథలు, కవితా సంపుటాలు నాలుగేసి ప్రతులు ఈనెల 25లోగా.. ”సుభాషిణితోట, ఇంటినెంబర్ 15-13-309, బ్యాంకు కాలనీ -ఖమ్మం – 507002 “ చిరునామాకు పంపాలి. వివరాలకు 9502818774. విజేతలకు ఆగస్టు నెలలో ఖమ్మంలో జరిగే సభలో పురస్కారాలు అందజేయబడతాయి.
హాసిని రామచంద్ర లిటరరీ ఫౌండేషన్
మంజీరా రచయితల సంఘం ఆహ్వానం..
- Advertisement -
- Advertisement -


