Friday, August 28, 2026
E-PAPER
Homeదర్వాజచిగురాకుల కలల పాటలు

చిగురాకుల కలల పాటలు

- Advertisement -

అచ్చం
మనిషి ఆకారంలో ఆ చెట్టు
వేలాడుతూ రెండు పిట్ట గూళ్ళు
చెట్టుకు రెండు కళ్లలా…
వాటి చుట్టూ వున్న పుల్లా పుడకల్ని చూస్తుంటే
కంటికి రెప్పల్లా..
చీకటి పడ్డా పక్షులు గూటికి చేరుకోలేదు
వీస్తున్న హోరు గాలికి గూటి ద్వారం
పూర్తిగా మూసుకుని పోయింది
గుండెల్లో ఒకటే గుబులు….
అంతటా నల్లని నిశ్శబ్దం
గూట్లోంచి ఏవో సన్నని ధ్వనులు
బుజ్జి పిట్టల్ని నిద్ర పుచ్చుతూ తల్లి పక్షి పాడే
చిగురాకు జోల కాదు కదా ?
ఆకులన్నీ కాగితాలుగా చేసుకున్నా
ఆ తల్లి తీసే రాగాల్ని కవిత్వంగా తర్జుమా చెయ్యలేమేమో…!
ఇంతకీ ఆ ‘పసి’డి కలలు
గూటి లోపలకి ఏ మార్గం గుండా వె
ళ్ళాయో అర్థం కాలేదు…
సందేహం ఎందుకూ?
మూసుకుని పోయిన కనుల లోపలికి
ఒక్క “పాటే “కలగా రూపాంతరం చెంది
దర్జాగా ప్రవేశించగలదు..
భమిడిపాటి వెంకటేశ్వరరావు, 72859 51828.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -