న్యాయవాద వృత్తిలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

– జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి ఏం జయపాల్ రెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
2024-25 విద్యా సంవత్సరానికి గాను న్యాయవాద వృత్తిలో (03) సంవత్సరముల శిక్షణ కొరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని యస్సి  కులములకు చెందిన న్యాయవాద పట్టభద్రుల  నుండి షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ, యాదాద్రి భువనగిరి జిల్లా తరపున  దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి అధికారి ఎం జయ పాల్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పోరారు. న్యాయశాస్త్రములో డిగ్రీ ఉత్తీర్ణులై,  తల్లిదండ్రుల వార్షిక ఆదాయము రూ. 2.00 లక్షలకు మించని యస్.సి. అభ్యర్ధులు అర్హులు. శిక్షణ కాలములో నెలకు రూ. 3,000/- ల చొప్పున స్టైఫండ్ , పుస్తకముల, కంప్యూటర్, ఫర్నీచర్ , లాయర్ డ్రస్ కొనుగోలు కొరకు ఒకసారి మాత్రమే రూ.50,000/- లు చెల్లించబడును. ధరఖాస్తులు సమర్పించుటకు చివరి తేది. 06.07.2024. లోపు ఆన్ లైన్ (https://telanganaepass.cgg.gov.in) నందు ధరఖాస్తు చేసుకోవాలని కోరారు. అభ్యర్ధులు పూర్తి బయోడేటాతో పాటు కులము, ఆదాయము మీ సేవా ద్వారా పొందినవి అయి ఉండవలెను,  పదవ తరగతి నుండి డిగ్రీ వరకు , యల్.యల్.బి. మార్కుల జాబితాతో పాటు బార్ కౌన్సిల్ నమోదు (తప్పనిసరిగా) పత్రములతో జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి, యాదాద్రి భువనగిరి  కార్యాలయము, ఎస్. 17, రెండవ అంతస్తు, కలెక్టర్ కప్లెక్ష్, రాయగిరి యందు   తేది. 06.07.2024. సా.5.00 గంటల లోపు సమర్పించగలరని కోరారు.
Spread the love