
మండలంలోని నాలేశ్వర్ గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మాన్లు మాజీ తాజా సర్పంచ్ సరీన్ లు శనివారం ఆహ్వానించారు. ఈనెల 8, 9వ తేదీల్లో మహాశివరాత్రి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో జరిగే ఉత్సవాల గోడ ప్రతులను అందించి ఆహ్వానించారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాగాజీ లక్ష్మణ్, రమేష్, కృష్ణ, శివ తదితరులు ఉన్నారు.