డిగ్రీ మొదటి సంవత్సర ప్రవేశాలకు ఆహ్వానం: ప్రిన్సిపాల్ రోజా

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ లో గల తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళా కళాశాల, (దమ్మపేట) నందు డిగ్రీ మొదటి సంవత్సర మూడో దఫా స్పాట్ కౌన్సిలింగ్ కు సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ ఆదేశాల మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బి. రోజా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపీసీ, ఎంపీసీ సిఎస్, బీజెడ్సీ, బీఏ, బి.కామ్ (జనరల్), బీ కామ్ (సీఏ) గ్రూపులలో ప్రవేశానికీ ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించిన ముఖ్యంగా గిరిజన విద్యార్థినులు అర్హులు అని తెలిపారు. కళాశాలకు తీసుకురావలసిన ఒరిజనల్ ధృవ పత్రాలు పది, ఇంటర్, ఇంటర్ హాల్ టికెట్, కులం, ఆదాయ, ఆధార్, స్టడీ, ఐదు నుండి పదో తరగతి వరకు కండక్ట్, టీజీ యూజీసెట్ హాల్ టికెట్, ఐదు పాస్ పోర్ట్ ఫొటోస్ కళాశాలకు రావాలని తెలిపారు. ఈ నెల 11 నుండి 20వ తారీఖు వరకు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం 5 గంటలు వరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9381331472 తెలిపారు.
Spread the love