గురువులు చూపిన మార్గంలో నడవాలి : ఐపీఎస్‌ రుత్విక్‌

నవతెలంగాణ-హన్మకొండ
ప్రతీ ఒక్కరు గురువు చెప్పిన మాటలు వింటే ఉన్నత స్థాయి చేరుకుంటారని ఐపీఎస్‌ ఆఫీసర్‌ రిత్విక్‌ అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా శుక్రవారం శ్రీనివాస్‌ గురుకుల్‌ పాఠశాలలో పతాకావిష్కరణకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐపీఎస్‌ కె.సాయిరిత్విక్‌ శ్రీనివాస్‌ గురుకుల పాఠ శాలలో 10వ తరగతి వరకు విద్యనిభ్యసించి, యూపీఎస్‌సీ-2022 లో జాతీయ స్థాయి లో 558 ర్యాంక్‌ తో ఐపీఎస్‌ సాధించినందుకుగాను విద్యాబుద్ధులు నేర్పిన ప్రముఖ గణిత గురువులు చిదురాల ఇందిర, శ్రీనివాస్‌, చంద్రుడు, విజరు, సుందర్‌ సింగ్‌, మక్బూల్‌, శ్రీనివాసాచార్యులు, నాగేందర్‌ విద్యార్థిని ఘనంగా అభినందించి ఆశీర్వదించారు. అనంతరం సాయి రిత్విక్‌ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్ననాటి నుండే దిశా నిర్దేశాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నిస్తే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని తెలిపారు. దానికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ప్రోద్బలం ఎంతో తోడ్పడతాయని తెలిపారు.
శ్రీనివాస్‌ గురుకుల్‌ పాఠశాలలో 8,9,10 తరగతుల్లో నేర్చుకున్న పాఠ్యాం శాలు సివిల్స్‌ ప్రిపరేషన్‌లో ఎంతో ఉపయోగ పడ్డాయని, ఉపాధ్యాయులు చెప్పే ప్రతీఅంశాన్ని జాగ్రత్తగా వినాలని, పాఠశాల స్థాయి నుండి ఒక లక్ష్యాన్ని నిర్దేశించు కుని అంకుఠిత దీక్షతో సన్నద్ధమైతే సులువుగా సివిల్స్‌ సాధించ వచ్చు అని విద్యార్థులకు సివిల్స్‌పైన అవగాహన కల్పించారు. సాయి రుత్వీక్‌ తో పాటు అతని మిత్రులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని గురువులతో ఉన్న అనుబంధాన్ని మిత్రులతో ఉన్న గత స్మృతులను నెమరువేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాన్యం చిదురాల సోమరత్నం , యుగం ధర్‌, వినరు,ఉదరు, విజరు, అనిల్‌, రాజేష్‌, విద్యార్థులు పాల్గొని ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

Spread the love