ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం నాన్చుడు ధోరణి
భావోద్వేగాలతో ప్రాణాలు తీసుకుంటున్న కార్మికులు
రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజూ వందశాతం సమ్మె సక్సెస్
ఆనాడు కేసీఆర్..నేడు రేవంత్..మార్పు ఏది?
ఎస్ఎస్ఆర్ శాస్త్రి
రోమ్ నగరం తగులబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట! ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇలాంటి చర్యలకే పాల్పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె వందశాతం దిగ్విజయంగా సాగుతోంది. 2019లో 53 రోజులు సమ్మె చేసి, అరిగోస పడిన ఆర్టీసీ కార్మికులు మళ్లీ ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవడం కోసం రోడ్డెక్కారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఆ సమ్మె సమయంలో 36 మంది ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోరోజు సమ్మె నాటికే ఇద్దరు ఆర్టీసీ కార్మికులు భావోద్వేగంతో ఆత్మహత్యలకు యత్నించారు. వారిలో ఒకరు మరణించారు. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణీకులు నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీ అధికారిక గణాంకాల ప్రకారమే రోజుకు 36 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మరి ఇప్పుడు వారికి ప్రత్యామ్నాయ రవాణా ఎక్కడ ఉంది? అయినా ఆర్టీసీ కార్మికులు గొంతెమ్మ కోర్కెలేం కోరట్లేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన సమ్మెనాటి పరిస్థితులే నేటికీ ఆర్టీసీలో ఉన్నాయి. వాటిన్నింటిపై కాంగ్రెస్పార్టీకి సంపూర్ణ అవగాహన ఉంది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి ఆనాటి సమ్మెకు మద్దతు తెలుపుతూ, తాము అధికారంలోకి వస్తే, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తామంటూ ప్రసంగాలు చేశారు. ఆనాటి ఆర్టీసీ కార్మికుల కష్టాలు, సమస్యల్ని కాంగ్రెస్పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చారు. ఆ మ్యానిఫెస్టో కమిటీకి ఇప్పటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబే చైర్మెన్. మరి ఇంత అవగాహన ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం అధికారంలోకి వచ్చాక వారి సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంది? తాజాగా రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీకి సంబంధించి ‘ప్రస్తుత ప్రభుత్వంలో టీజీఎస్ఆర్టీసీ పునరుజ్జీవం’ పేరుతో నాలుగు పేజీల్లో 9 అంశాలతో ఓ ప్రకటన విడుదల చేశారు. దీనిలో కేసీఆర్ హాయాంలో, ఇప్పటి ప్రభుత్వ హయాంలోని పరిస్థితుల్ని ఏకరువు పెట్టారు. ‘మహాలక్ష్మి’ స్కీం గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. ఆ స్కీం వల్ల మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులపై పెరిగిన పనిభారాల్ని ప్రస్తావించలేదు. మంత్రి పేర్కొన్న 9 అంశాల్లో ఏ ఒక్కటీ కార్మికుల ప్రయోజనాలను ఉద్దేశించి లేదు. పదేళ్లుగా వేతనాలు పెరగలేదనీ, ఖర్చులు పెరిగి, బతుకులు అగం అవుతున్నాయని ఆర్టీసీ కార్మికులు మొత్తుకుంటుంటే, దాని గురించి రేఖామాత్రంగా కూడా స్పందించలేదు. ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఎందుకు కచ్చితమైన నిర్ణయం ప్రకటించలేదు. వారి సమస్యలపై మంత్రివర్గానికి అవగాహన లేదనుకోవాలా? ఆర్ధికశాఖ మంత్రి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘంతో



