గవర్నర్ శివ పత్రాప్ శుక్లా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలే కాకుండా విద్యార్థులకు కావాల్సిన నైపుణ్యాలనూ అందించాలని రాష్ట్ర గవర్నర్, వివిధ విశ్వ విద్యాలయాల ఛాన్స్లర్ శివ ప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. ఉపాధి సామర్థ్యాలతోపాటు పరిశోధనలపై కూడా యూనివర్సిటీలు దృష్టి సారించాలని ఆయన సూచించారు. ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ అధ్యక్షతన వీసీల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప కులపతులు స్వయంగా తరగతులు బోధిస్తూ నూతన అధ్యాపకులకు ఆదర్శం గా నిలవాలని కోరారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా అనుసరించిన విధానాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వం, విద్యాశాఖతో సమన్వయం చేసుకోవటం ద్వారా నిధుల సమీకరణ, కోర్సుల రూపకల్పన, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి జాతీయ కార్య క్రమాల అమలులో చురుకైన పాత్ర పోషించాలని సూచించారు.
డిగ్రీలే కాదు.. నైపుణ్యాలనూ అందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



