– గూడెం గ్రామంలో పశువుల మేతగా వరిపైరు
నవతెలంగాణ – బెజ్జంకి
మండలంలోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పంటలకు సాగునీరందడం లేదు. ఆరుగాలం కష్టపడి సాగుచేసిన రైతన్నల ఆశలపంటలు ఎండుతున్నాయి. మండల పరిధిలోని గూడెం గ్రామంలో ఓ రైతు సాగుచేసిన వరిపైరుకు సాగు నీరందక ఎండిపోతోంది. దిక్కుతోచని స్థితిలో ఎండిపోతున్న వరిపైరును రైతు పశువులకు మేతగా వినియోగించడం శనివారం నవతెలంగాణకు కనపడింది.