యూనివర్సిటీ లకు తక్కువ నిధులు కేటాయించడం సిగ్గుచేటు: పిడిఎస్ యూ

నవతెలంగాణ – డిచ్ పల్లి
రాష్ట్ర బడ్జెట్ లో తెలంగాణ యూనివర్సిటీలకు తక్కువ నిధులు కేటాయించడం సిగ్గు చేటని తెలంగాణ యూనివర్సిటీ పి.డి.ఎస్.యు ప్రధాన కార్యదర్శి జయంతి, పి.డి.ఎస్.యూ సోషల్ మీడియా ఇంఛార్జి రవీందర్ లు అన్నారు.మంగళవారం తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ముందు తే.యు పి.డి.ఎస్.యూ  కమిటీ అధ్వర్యంలో  రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్. యూ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టో లో విద్యారంగానికి 15% శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి, నేడు
రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 8% శాతం లోపే నిధులు కేటాయించడం సరైంది కాదని , యూనివర్సిటీల అభివృద్ధి కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగిందని ,యూనివర్సిటీలు అభివృద్ధి చెందాలంటే అత్యధిక నిధులు కేటాయించడం అవసరమని, బడ్జెట్ ను సవరించి యూనివర్సిటీలకు అధిక నిధులు కేటాయించలని, తెలంగాణ యూనివర్శిటీ లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని,
యూనివర్సిటీలో ఆడిటోరియం, హెల్త్ సెంటర్, మినీ స్టేడియం నిర్మించాలని డిమాండ్ చేశారు.లేనిచో కెసిఆర్ కి పట్టిన గతే రేవంత్ రెడ్డి కి పడుతుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ కమిటీ సభ్యులు అక్షయ్, హన్మండ్లు,నవ్య,రేణుక, ప్రవీణ,ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love