నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది బీఆర్‌ఎస్ స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు కాంగ్రెస్లో చేరుతున్నారు. మరుక్షణమే అప్రమత్తమైన బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థుల మెప్పుకోసం మళ్లీ బీఆర్‌ఎస్ లో చేర్పిస్తున్నారు. ఇలా పొద్దున ఒక పార్టీలో రాత్రి మరో పార్టీలో ప్రజా ప్రతినిధులు నాయకులు చేరుతున్నంతో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో ఏ పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారు. అర్థం కాక జనాలు తలలు పట్టుకుంటున్నారు అప్పుడే చేతు గుర్తుకు ఓటు వేయమని చెప్పిన నాయకులు తెల్లారితే మళ్ళీ కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పడం మరోరోజు చేతి గుర్తుకు ఓటు వేయమని చెప్పడం వేయమని చెప్పడంతో జనాలలో అయోమయం నెలకొంది. ఎమ్మెల్యే అభ్యర్థుల మెప్పు కోసం మండల స్థాయి కాంగ్రెస్ బీఆర్‌ఎస్ నాయకులు తహతహ పడుతున్నారు.