బీసీల కుల గణాంకన పట్టించుకోని బీజేపీని గద్దె దించడం ఖాయం

– తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర గిరగాని బిక్షపతి గౌడ్
తెలంగాణ – నెల్లికుదురు
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల వలన చేపట్టని బీజేపీని గద్దెదించడం ఖాయమని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరగాని బిక్షపతి గౌడ్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడినట్లు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దశాబ్దాల కాలంగా కనీసం బీసీల వైపు కన్నెత్తి కూడా చూడని అధికార పక్షాలు తదుపరి బీసీ ప్రధానిగా అవడం కోసం బీజేపీ పార్టీ అధికారంలోకి రాగానే బీసీ కులఘనణ చేసి బీసీ రిజర్వేషన్లు చేస్తామని హామీ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన చేసిన కూడా కనీసం బిసి కులగన చేయకపోవడం చాలా దురదృష్టకరం అని అన్నారు. 10 సంవత్సరాల పాటు బీజేపీ ప్రభుత్వం ఆలయాపన చేసింది తప్ప బీసీల అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చెందారు. ఇప్పటికైనా బీసీల ఐక్యతతో మా గన్యాయం చేస్తున్న వారిని ఎదిరిస్తున్నామని అన్నారు. బీసీ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ భారత్ జోడోయాత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ  బీసీలపైన ఒక నిర్ణయం తీసుకొని వారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేసి బిసి రిజర్వేషన్లు ప్రకటిస్తామని హామీ ఇవ్వడం, ఆ తదుపరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రాష్ట్రంలో కుల గణన చేసి ఎవరి జనాభా ఎంత ఉందనేది కూడా ఒక నిర్ణయిస్తామని అంశాన్ని తీసుకోవడం చాలా హర్షించ తగిన విషయము అని తెలిపారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని అభినందిస్తూ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏర్పడిన అనంతరం కులాల వారిగా లెక్కలు చూసి బీసీలవాట ప్రకారం చట్టసభల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో బీసీలకు సమాన వాటా కల్పించాలని ప్రకటన చేసిన రాహుల్ గాంధీ , సోనియాగాంధీ,   మల్లిఖార్జున ఖర్గే  , ముఖ్యమంత్రి  రెవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  గౌడ్ ల కు కృతజ్ఞతలు అని అన్నారు.
Spread the love