వివేక్ ఇంట్లొ ఐటీ సోదాలు

నవతెలంగాణ – హాజీపూర్
మాజీ ఎంపీ చెన్నూర్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి  నివాసం లో ఐటి సోదాలు జరుగుతున్నాయి. మంచిర్యాల లోని హైటెక్ కాలనీలో వివేక్ ఇంట్లో  ఉదయం 5 గంటలకు ఐటీ అధికారులు తన నివాసం వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు.గత కొన్ని రోజుల నుండి వివేక్ కు చెందిన కంపనీ ల డబ్బు ను చెన్నుర్ నియోజక వర్గం లో ఓటర్ల ను కొనేందుకు డబ్బు తరలిస్తున్నారు అని వస్తున్న సందర్భం లో ఈ రోజు వివేక్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది.నాయకులు ,అనుచరులు వివేక్ ఇంటికి చేరుకొని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.రెండు రోజుల క్రితం బాల్క సుమన్ హైదరాబాద్ కు వెళ్లి ఐటీ దాడులకు ప్లాన్ చేశారని వివేక్  అనుచరులు విమర్శిస్తున్నారు.
Spread the love