నేడు రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు ‘పెట్టుబడిదారులే సంపద సృష్టికర్తలు’ అంటూ పచ్చి అబద్ధాన్ని పదే పదే జపిస్తున్నారు. సింధూరం కవిత రచయితలు చంద్రబాబుకు ఏం చెబుతున్నారో చూడండి. ”పదే పదే గుర్తుపెట్టుకో/ శ్రమ చినుకులు పడితేనే/ ‘సిరి’ కాలం చిగురిస్తుంది/ రైతు జలం ప్రవహిస్తేనే/ ‘పచ్చదనం’ పండుతుంది/ శ్రమ స్వేదం తగిలితేనే/ సంపద ఎద చిందేస్తుంది” సమస్త సంపదలకు మూలం మానవ శ్రమ అన్న ప్రాథమిక ఆర్థిక సూత్రాన్ని ఇక్కడ రచయితలు గుర్తు చేస్తున్నారు. కష్టజీవుల నుదుట చైతన్య సింధూరాన్ని అద్దుతున్నారు. వారి పిలుపును అందుకుని ముందడుగేయడమే మన కర్తవ్యం. భావజాల రంగంలో వర్గ పోరాటం ప్రాధాన్యత చాలా ఎక్కువగా వున్న కాలంలో వివి, ఉష చేసిన ఈ గొప్ప ప్రయత్నం సాహిత్య రంగంలో సిద్ధాంత పరంగా ‘చిరకాలం నిలిచిపోతుంది.
– ఎం.వి.ఎస్.శర్మ
సాహిత్య రంగంలో నిలిచి తీరుతుంది
- Advertisement -
- Advertisement -


