నేడు,రేపు వర్షాలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు, మూడు రోజుల పాటు మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆకాశం మేఘావృతమై తేలికపాటి ఉంచి మోస్తరు వర్షం పడే సూచనలున్నాయి. ఆదివారం రాత్రి 10 గంటల వరకు రాష్ట్రంలో 242 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. నిర్మల్‌ జిల్లా బైంసాలో అత్యధికంగా 4.3 సెంటీమీటర్ల వర్షం పడింది. 40 ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లో బడిశా-పశ్చిమబెంగాల్‌ తీరాలకు దగ్గరలో ఆనవర్తనం నెలకొంది. దీని ప్రభావం వల్ల అక్కడే అల్పపీడనం ఏర్పడింది.

Spread the love