14నుంచి జాగల్‌ ఐపిఒ

– ధరల శ్రేణీ రూ.156-164
హైదరాబాద్‌ : ఫిన్‌టెక్‌ సంస్థ జాగల్‌ ప్రీపెయిడ్‌ ఓసియన్‌ సర్వీసెస్‌ ఇన్షియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపిఒ)కు వస్తోంది. ఈ నెల 14న ఇష్యూ ప్రారంభమై.. 18తో ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్ల బిడ్డింగ్‌ సెప్టెంబర్‌ 13న ప్రారంభమవుతుంది. సోమవారం వర్య్చూవల్‌గా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ ఎండి, సిఇఒ అవినాష్‌ రమేష్‌ గొడ్‌ఖిండి, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రాజ్‌ పి నారాయణమ్‌, సిఎఫ్‌ఒ ఆదిత్యా కుమార్‌ గ్రంధి మాట్లాడుతూ.. ఐపిఒ వివరాలను వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.392 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఇష్యూలో 1.04 కోట్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో విక్రయించనుంది. కంపెనీ ప్రమోటర్లు రాజ్‌ పి నారాయణమ్‌, అవినాష్‌ రమేష్‌ గోడ్‌ఖిండిలు సహా ఇందులో వాటాలు కలిగిన పలు సంస్థలు తమ వాటాలను విక్రయిస్తున్నారు. ఈ ఇష్యూలో కనిష్టంగా 90 ఈక్విటీ షేర్లు, ఆ తర్వాత 90 ఈక్విటీ షేర్ల గుణిజాలలో బిడ్లు వేయడానికి వీలుందని ఆ వర్గాలు తెలిపాయి.

Spread the love