జైన ముని ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూత..

నవతెలంగాణ – ఢిల్లీ: జైన గురువు ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ కన్నుమూశారు. చత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌గఢ్‌ తీర్థంలో కొన్ని రోజులుగా ఆయన దీక్షలో ఉన్నారు. ఈ క్రమంలోనే అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సల్లేఖనదీక్ష చేపట్టి స్వచ్ఛందంగా మూడు రోజుల నుంచి ఆహారం, పానీయాలు తీసుకోవడం మానేసిన ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు.
ప్రధాని సంతాపం
ఆయన మరణ వార్త తెలుసుకున్న మోడి  సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఆచార్య విద్యాసాగర్‌ మహారాజ్‌ మరణం దేశానికి తీరని లోటు. ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారు. ఆయన సేవ చిరస్మరణీయం. పేదరిక నిర్మూలన, సమాజ ఆరోగ్యం, విద్యను ప్రోత్సహంచడానికి జీవితాన్ని అంకితం చేశారు. గతేడాది ఆయన్ను కలిసి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టం. సమాజాభివృద్ధికి ఆయన అందించిన సహకారం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుంది’’ అని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ప్రధాని పేర్కొన్నారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను ప్రధాని షేర్‌ చేశారు. విద్యాసాగర్‌ మృతి పట్ల ఛత్తీస్‌గఢ్‌ సీఎం విష్ణుదేవ్‌ సాయ్‌ సంతాపం తెలిపారు.

Spread the love