Sunday, August 23, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నత్తనడకన జలసిరి పనులు.!

నత్తనడకన జలసిరి పనులు.!

- Advertisement -

లక్ష్యం వేలల్లో….ప్రారంభమైనవి పదుల్లోనే..
అవగాహన లేమి, సిబ్బంది ఆందోళనల ప్రభావం
నవతెలంగాణ – మల్హర్ రావు

ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది వరుణుడు ముఖం చాటేయడంతో,భవిష్యత్ లో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘జలసిరి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.వర్షపు నీటిని వడిసిపట్టే లక్ష్యంతో వంద శాతం సబ్సిడీతో ఆరు రకాల నీటి నిల్వ నిర్మాణాలను (రీచార్జ్ స్ట్రక్చర్స్) చేపట్టాలని అధికారులను ఆదేశించింది.అయితే,గ్రామాల్లో ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం,మరోవైపు సిబ్బంది తమ వేతనాల కోసం ఆందోళన చేస్తుండటంతో ఈ పథకం అమలు లక్ష్యాలకు ఆమడ దూరంలో నత్తనడకన సాగుతోంది.జలసిరి ఈ కార్యక్రమంలో భాగంగా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు,వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్స్ (పంట కుంటలు),సామూహిక ఇంకుడు గుంతలు,ఊటకుంటలు,ఎండిన బోరుబావుల వద్ద రీచార్జ్ స్ట్రక్చర్ల పనులు చేపట్టాల్సి ఉంది.ఎంపిక చేసిన పనుల్లో కనీసం 30 శాతం పూర్తి చేయాలని ఉన్న తాధికారులు స్పష్టం చేసినా మండలంలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

మండలంలో పురోగతి ఇలా..
ఇంకుడు గుంతలు: మండల వ్యాప్తంగా 3,000 ఇంకుడు గుంతలు నిర్మించాలన్నది లక్ష్యం. కాగా, ఇప్ప టివరకు కేవలం 10 మాత్రమే ప్రారంభమ య్యాయి.మరో 615 గుంతలకు ప్రతిపాదనలు మాత్రమే వచ్చాయి.

ఫామ్ పాండ్స్;
ప్రతి గ్రామ పంచాయతీకి ఐదు చొప్పున 15 పంచాయతీలకు గాను 75 ఫామ్ పాండ్స్ నిర్మించాలి. కానీ, తాడిచెర్లలో మాత్రమే పనులు ప్రారంభమయ్యాయి.పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ల వద్ద నిర్మించేందుకు సామూహిక ఇంకుడు గుంతలు మాత్రం ఇంకా ఒక్కటి కూడా మంజూరు కాలేదు.

బోరుబావి రీచార్జ్:
మండలంలో 15 గ్రామపంచాయతీల నుంచి 24 దరఖాస్తులు రాగా,ఒక్కటి కూడా  మంజూరు కాలేధని అధికారులు చెబుతున్నారు.పంచాయతీ తీర్మానం ద్వారా ఎండిపోయిన బోరుబావుల వద్ద ఈ పనులు చేపట్టాలి. వీటికి కూలీలు,మెటీరియల్ ఖర్చుల నిమిత్తం రూ.35 వేలు మంజూరు కానున్నాయి.ఊటకుంటలు ప్రతి గ్రామంలో ఊటకుంట నిర్మించాలన్నది ప్రభుత్వ నిబంధన. అయితే, దీనికి ఎక్కువ విస్తీర్ణంలో స్థలం అవసరం కావడం, ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడంతో మండలంలో ఏ ఒక్క గ్రామంలోనూ ఈ పనులు ప్రారంభం కాలేదు.

ప్రజలు ముందుకు రావాలి…విబిజీ రాం జి..ఎపిఓ హరీష్…
ఎల్నివో ప్రభావంతో వర్షాలు లేకతీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది.దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం  జలసిరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అవగాహన కల్పిస్తున్నాం.రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి దరఖాస్తులు చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -