న్యూఢిల్లీ : తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభించిన జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాలు 50 కోట్ల మార్క్‌కు చేరాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 67 శాతం పైగా ఖాతాలు గ్రామీణ ప్రాంతాల నుంచి నమోదయ్యాయని పేర్కొంది. వీటిలో మొత్తంగా రూ.2.03 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయని తెలిపింది. ఈ ఖాతాలు కలిగిన వారికి దాదాపుగా 34 కోట్ల రూపే కార్డులను జారీ చేసినట్లు పేర్కొంది. ఆయా ఖాతాల్లో సగటు నిల్వ రూ.4,076గా ఉందని.. వీరిలో 5.5 కోట్ల మంది ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)ని పొందుతున్నారని వెల్లడించింది.